TG Job Calendar 2024: తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 యొక్క పూర్తి వివరాలు, తేదీలు ఇవే

TG Job Calendar 2024: తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ లో జాబ్ క్యాలెండరు ని ప్రకటించింది. 2024-25 జాబ్ క్యాలెండర్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం . TSPSC, పోలీస్ శాఖ , ట్రాన్స్కో, టీచర్ భర్తీలతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షా తేదీలు మరియు నియామక ప్రక్రియ పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం .

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25: నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ లో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు శుక్రవారం శాసనసభలో ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ క్యాలెండర్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షా తేదీలు మరియు నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

ముఖ్య పరీక్షల తేదీలు:

1. TSPSC గ్రూప్-1: 

– నోటిఫికేషన్ విడుదల తేదీ: సెప్టెంబర్ 2024

– ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: అక్టోబర్ 2024

– మెయిన్స్ పరీక్ష తేదీ: జులై 2025

2. TSPSC గ్రూప్-2:

– మొదటి నోటిఫికేషన్ తేదీ: నవంబర్ 2024

– మొదటి పరీక్ష తేదీ: డిసెంబర్ 2024

– రెండవ నోటిఫికేషన్ తేదీ: మే 2025

– రెండవ పరీక్ష తేదీ: అక్టోబర్ 2025

3. TSPSC గ్రూప్-3:

– మొదటి నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 2024

– మొదటి పరీక్ష తేదీ: నవంబర్ 2024

– రెండవ నోటిఫికేషన్ తేదీ: జులై 2025

– రెండవ పరీక్ష తేదీ: నవంబర్ 2025

4. టీచర్ రిక్రూట్‌మెంట్:

సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన : తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు – వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు

– TET నోటిఫికేషన్ తేదీ: నవంబర్ 2024

– TET పరీక్ష తేదీ: జనవరి 2025

– DSC నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 2025

– DSC పరీక్ష తేదీ: ఏప్రిల్ 2025

5. పోలీస్ రిక్రూట్‌మెంట్ వివరాలు:

– SI, కానిస్టేబుల్ నోటిఫికేషన్ తేదీ: ఏప్రిల్ 2025

– పరీక్ష తేదీ: ఆగస్టు 2025

ఇతర ముఖ్య నియామకాలు:

1. వైద్య రంగం ఉద్యోగాలు:

– ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ తేదీ: సెప్టెంబర్ 2024

– పరీక్ష తేదీ: నవంబర్ 2024

2. ట్రాన్స్‌కో ఉద్యోగాలు :

– ఇంజినీరింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 2024

– పరీక్ష తేదీ: జనవరి 2025

3. అటవీ శాఖ ఉద్యోగాలు:

– ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 2025

– పరీక్ష తేదీ: మే 2025

Telangana Bandh ; రేపు తెలంగాణ బంద్ స్కూల్, కాలేజ్ అన్నీ బంద్

4. ఉన్నత విద్య ఉద్యోగాలు:

– డిగ్రీ కాలేజీ అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ నోటిఫికేషన్ తేదీ: జూన్ 2025

– పరీక్ష తేదీ: సెప్టెంబర్ 2025

5. సింగరేణి ఉద్యోగాలు:

– వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ తేదీ: జులై 2025

– పరీక్ష తేదీ: నవంబర్ 2025

6. గెజిటెడ్ ఉద్యోగాలు:

– నోటిఫికేషన్ తేదీ: జనవరి 2025

– పరీక్ష తేదీ: ఏప్రిల్ 2025

ఉద్యోగార్థులకు ముఖ్య సూచనలు:

1. ప్రతి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా నోటిఫికేషన్ లో పూర్తిగా చదవండి. అర్హతలు, వయో పరిమితి మరియు దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా చేసుకోండి.

2. పరీక్షకు ముందస్తుగా సిద్ధమవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి.

3. మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో నిర్ణయం తీసుకొండి. ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, దానికి తగిన ప్రణాళికను రూపొందించుకోండి.

4. మాక్ టెస్ట్‌లు రాయండి. పరీక్ష పద్ధతిని అర్థం చేసుకోవడానికి మరియు మీ స్థాయిని అంచనా వేసుకోవడానికి మాక్ టెస్ట్‌లు ఉపయోగపడతాయి.

5. తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను తరచుగా చూస్తూ ఉండండి.

ప్రభుత్వం మాట:

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ప్రతి నోటిఫికేషన్‌లోనూ ఖాళీల సంఖ్యను స్పష్టంగా తెలియజేస్తాం. ప్రభుత్వం పారదర్శకంగా, న్యాయబద్ధంగా నియామకాలు చేపడుతుంది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు” అని తెలిపారు.

 

Leave a Comment