Anna Canteen Menu Price List : అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్ ! మన ఆంధ్ర ప్రభుత్వం ఎట్టకేలకు ‘అన్న క్యాంటీన్లు’ స్టార్ట్ చేసింది . సీఎం చంద్రబాబు నాయుడు గారు తానే స్వయంగా విజయవాడలో ఓ క్యాంటీన్ని ప్రారంభించారు. మొదటి దశలో 60 క్యాంటీన్లు తెరిచారు. అన్న క్యాంటీన్లను అక్షయపాత్ర ఫౌండేషన్ నడుపుతుంది.
Anna Canteen Price List :అన్న క్యాంటీన్ల స్పెషాలిటీ ఏంటి?
టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ కేవలం ఐదు రూపాయలకే! 2014 ఎన్నికల్లో టీడీపీ అప్పుడు ఇచ్చిన హామీ ఇది. 2019 లో అధికారం కోల్పోయిన మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఈ అన్న క్యాంటిన్ ని ప్రారంభించింది
కొత్త ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం 203 క్యాంటీన్లు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు . సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ “కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్ లాంటి వాటితో పోల్చొచ్చు మన క్యాంటీన్లని. క్వాలిటీ కి తగ్గకుండా , హైజీన్ ని మెయింటైన్ చేస్తూ అన్నీ మంచిగా ఉంటాయి” అన్నారు.
అన్న క్యాంటిన్ లో సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ లాంటివి పెడుతున్నారు. ఎక్కడ మోసగాళ్లు తావు లేకుండా ఉండటానికి అంట.
Anna Canteen Menu Price List
అన్న క్యాంటిన్ లో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం. పేదవాళ్ళకి అన్న క్యాంటిన్ ఒక్క పెద్ద దిక్కు.మీరు కూడా ఈ క్యాంటీన్లకి విరాళాలు ఇవ్వండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఇంకా ఎక్కువ మందికి అన్నం పెట్టొచ్చు అని కూడా అన్నారు.