ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైస్సార్ రైతు భరోసా పేరుతో ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చారు. చంద్రబాబు నాయుడు రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఆర్ధికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సాయం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి అందచేయనున్నారు. సూపర్ సిక్స్ స్కీమ్స్ పథకంలో భాగంగా ప్రతి మహిళలకు 1500రూపాయలు నెలకు ఆడబిడ్డ నిధి పేరుతో అలాగే ఆసరా పెన్షన్ కింద ఎన్టీఆర్ భరోసా పేరుతో వృదులకు, వితంతులకు ఇలా పెన్షన్ అందుకునే వారికీ నెలకు 4000రూపాయలు సాయంగా, అలాగే బడికి వెళ్లే ప్రతి పాప బాబుకి తల్లికి వందనం పేరుతో ఏటా 15,000రూపాయలు, అలాగే ప్రతి కుంటాంబానికి 3ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే రైతులకు ముఖ్యంగా ఏటా 20,000రూపాయలు సాయం చేయనున్నారు. అయితే ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం అందుకునే వారికీ కొత్త రూల్స్, అర్హతలు, ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారో మరిన్ని విషయాలు ఏంటో చూద్దాం..
Annadata Sukhibhava Scheme
అన్నదాత సుఖీభవ పథకం పొందాలంటే రూల్స్ చూద్దాం
-ఆధార్ కార్డ్
-బ్యాంకు పాస్ బుక్
-రేషన్ కార్డ్
-పంట పాస్ పుస్తకం
-పాన్ కార్డ్
-మొబైల్ నెంబర్
-కుల ధ్రువీకరణ పత్రం
-ఆధార్ కార్డ్ మీ బ్యాంకు పాస్ కి లింక్ అయి ఉండాలి
-అలాగే మీ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ తో కూడా లింక్ అయి ఉండాలి
-కుటుంబంలో ఎంత మంది ఉన్న ఇంట్లో ఒక్కరికి మాత్రమే అన్నదాత డబ్బులు జమ చేయబడును
-అంటే రేషన్ కార్డ్ ఉన్న కుంటుంబంలో ఒక్కరికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి.
-ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేసిన వారికీ డబ్బులు జమ కావు
-E-KYC చేసుకొని ఉండాలి
-E-KYC చేసుకోకపోతే డబ్బులు జమ కావు.
Annadata Sukhibhava Scheme For Farmers
అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి
– పీఎం కిసాన్ నిధి కింద 17వ విడత డబ్బులు ఈ వారంలో అందరి అకౌంట్లో జమ అయ్యాయి. పీఎం కిసాన్ కి ఎలాంటి రూల్స్ ఉన్నాయో అలాంటి రూల్స్ నే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత స్కీం కి కూడా పెట్టాలి అని చూస్తుంది. క్రితం ప్రభుత్వం 5సెంట్లు భూమి ఉన్న రైతు భరోసా పేరుతో డబ్బులు జమ చేసే వారు. కానీ ఈ సారి చంద్రబాబు పూర్తి పారదర్శకంగా ఈ పథకాన్ని పీఎం కిసాన్ మాదిరిగా నిర్ధిష్టమైన రూల్స్ పెట్టి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేలా ఈ పథకాన్ని అమలు చేయాలి అని అనుకుంటున్నారు.
అలాగే అన్నదాత స్కీం డబ్బులను పీఎం కిసాన్ డబ్బులు జమ అయినా రెండు రోజుల్లో రావాలి. కానీ ఇంకా ఆ డబ్బులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. కొత్త ఏర్పడిన ప్రభుత్వం కదా క్రితం ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది. ఆర్థికంగా డబ్బులను జమ చేసి జూలై మొదటి వారం లేదా రెండో వారంలో ఈ డబ్బులను రిలీజ్ చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Chandrababu On Annadata Sukhibhava Schemes
అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత డబ్బులు ఎంత వస్తాయో
-పీఎం కిసాన్ 6,000 రూపాయలు డబ్బులను మొదటి విడతగా 2000 రూపాయలు జమ చేసారు. అలాగే అన్నదాత పథకం కింద 20,000రూపాయలను కూడా 3విడతలల్లో జమ చేయాలి అని అనుకుంటున్నారు. మొదటి విడత డబ్బులు 6,500రూపాయలను లేదా 6,000 రూపాయలను జమ చేయాలి అని ఆలోచనలో ఉన్నారు.
Annadatha sukibava