indian Post Office RD Scheme 2024 in Telugu : మీరు కష్టపడి సంపాదించినా మీ జీతంలో నుండి కొంత మొత్తాన్ని ఆదా చేసి, భవిష్యత్తులో మంచి ఆకర్షనియమైన లాభాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ RD (రికరింగ్ డిపాజిట్) స్కీమ్ లో పెట్టుబడి పెట్టండి. అధిక లాభలను అర్జీంచండి.
Post Office RD Scheme ప్రధాన ఆకర్షణలు:
1. సులభంగా నెలవారీ పొదుపు
2. పక్కా గ్యారెంటీడ్ రిటర్న్స్
3. ప్రభుత్వ మద్దతుతో సెక్యూరిటీ
4. చిన్న మొత్తం పొడుపుతో ప్రారంభించవచ్చు.
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో, మీరు ప్రతి నెలా ఒక సిర్థమైన మొత్తాన్ని జమ చేస్తారు. మీ డబ్బు సేఫ్ గా పెరుగుతుంది, మీకు పక్కా ఒక్కే వడ్డీ రేటుతో లాభం వస్తుంది.
ఉదాహరణగా చూద్దాం:
మీరు ప్రతి నెల ₹3,000 రూపాయలను 5 సంవత్సరాలు
పాటు జమ చేస్తే వడ్డీ రేటు 6.7% సంవత్సరానికి వస్తుంది.
5 సంవత్సరాల తర్వాత మీకు ఏమి లభిస్తుంది:
– పోస్ట్ ఆఫీస్ RD స్కీం లో ₹1,80,000 రూపాయలను జమ చేస్తారు. మీకు వడ్డీ ₹34,097రూపాయలతో కలిపి మొత్తం లాభం₹2,14,097 మీ అకౌంట్లో జమ చేస్తారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి వస్తుంది.
ఈ స్కీమ్ ఎవరికి సరిపోతుంది?
మీరు ఉద్యోగస్తులు అయినా,చిన్న వ్యాపారస్తులు అయినా, గృహిణులు అయినా, విద్యార్థులు అయినా, మరియు పొదుపు అలవాటు పెంచుకోవాలనుకునే ఎవరైనా ఈ స్కీం తీసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ ప్రయోజనాలు:
1. ప్రభుత్వ గ్యారెంటీతో మీకు సురక్షితమైన పెట్టుబడి మరియు 100% డబ్బు సురక్షితం.
2. నెలవారీ వడ్డీ జమతో స్థిరమైన లాభం వస్తుంది.
3. మీరు తక్కువ పెట్టుబడి మొత్తంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు.
ఈ స్కీమ్‌లో ఎలా పాల్గొనాలి?
1. మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించండి.
2. RD ఖాతా తెరవడానికి పోస్ట్ ఆఫీస్ నుండి ఫారమ్ ని తీసుకొని నింపండి.
3. అవసరమైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పాస్ ఫోటో వంటి జిరాక్స్ పత్రాలను సమర్పించండి
4. మీ మొదటి పొదుపు పెట్టుబడిని జమను చేయండి
ముఖ్యమైన సలహా :
– ఖాతా తెరిచిన తర్వాత ప్రతి నెలా పక్కా సకాలంలో జమ చేయడం మాత్రం మర్చిపోకండి.
– మీ సంపాదన తగ్గట్టు మీ పెట్టుబడి లక్ష్యాలకు తగినట్లుగా జమ చేసుకోండి.
– ఇన్ కామ్ టాక్స్ సేవింగ్స్ కోసం సెక్షన్ 80C కింద మినహాయింపును కూడా పొందవచ్చు.
ఇప్పుడే ప్రారంభించండి!
పోస్ట్ ఆఫీస్ లో మీ భవిష్యత్తును సెక్యూరిటీ చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ 2024 ఒక అద్భుతమైన అవకాశంగా ఉపయోగపడుతుంది. తక్కువ మొత్తాలతో ప్రారంభించి, మీ లాభలను పెంచుకోండి. మీ కలలను నిజం చేసుకోవడానికి ఈరోజే మర్చిపోకుండా మొదలుపెట్టండి!
ఇంకా మరిన్ని వివరాలు మీ మొబైల్ ద్వారా భారత పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ లో (https://www.indiapost.gov.in)ను అలాగే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర పూర్తి వివరాలు తీసుకోండి పెట్టుబడి పెట్టండి .