Telangana Praja Palana Scheme 2024 -తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలు ప్రధాన కారణమని అందరికి తెలుసు . ఈ ఆరు హామీలను అమలు పై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంది.
ప్రధాన హామీలు
1. మహాలక్ష్మి పథకం :ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన అలాగే 1500 రూపాయలు నెలకు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది.
2. గృహజ్యోతి పథకం: గృహ జ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ని అందిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
3. ఆరోగ్యశ్రీ పరిధి పెంపు: ఆరోగ్యశ్రీ పథకాన్ని 5లక్షలు ఉన్నదానిని 10లక్షలు చేసి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
ప్రజా పాలన పునఃప్రారంభం
డిసెంబర్ చివరి వారంలో ప్రజాపరిపాలన ద్వారా దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రజా పాలన యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను స్టేటస్ ని సలహాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చు తెలుసుకోవచ్చు .
దరఖాస్తు ఎలా చేసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి మరో అవకాశం ఇస్తుంది . ఆదిలాబాద్ కలెక్టరేట్ సీపీఓ కార్యాలయంలో కలెక్టర్ ప్రజా పరిపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.
ఆరు గ్యారంటీలకు అవసరమైన పత్రాలు:
– ఆధార్ కార్డు
– రేషన్ కార్డు
– విద్యుత్ కనెక్షన్ బిల్లు
– గ్యాస్ కనెక్షన్ బిల్లు
-రేషన్ కార్డ్
–
ప్రజా పాలన అప్లికేషన్ లోపాలను సరి చేయడం
ప్రజా పాలన అప్లికేషన్ లోపాలు కారణంగా చాలా మంది తప్పులు చేశారు ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా లేదా మీ ఊరి మీ సేవా కేంద్రాల్లో తమ అప్లికేషన్ ప్రాసెస్ ని సరి చేసుకోవచ్చు .
ముఖ్యమైన పాయింట్లు:
– గృహ జ్యోతి స్కీం ద్వారా ఉచిత 200 యూనిట్ విద్యుత్ బిల్లు కోసం తప్పుగా ఇచ్చిన UAC నంబర్ లేదా సర్వీస్ నంబర్ ను సరి చేసుకోవచ్చు.
– ఉద్యోగాలకోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లిన వారు తమ దరఖాస్తులను మళ్ళీ చేసుకోవచ్చు. ప్రజా పాలన దరఖాస్తు లోపాలను సరి చేసిన తర్వాత అర్హులైనవారికీ వచ్చే నెల నుండి జీరో కరెంట్ బిల్లును పొందవచ్చు.